రాజ్ విరాట్ దర్శకత్వంలో నందు హీరోగా రష్మి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కు పెద్ద ఫ్యాన్ గా తన జీవిత కథ ను పూరి జగన్నాథ్ కు ఇచ్చి డైరెక్షన్ చేయించటమే తన కోరికగా తిరుగుతూ ఉంటాడు హీరో నందు. కాగా నేడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా… లవ్ ఆల్ ది హేటర్స్ అనే ఆంథమ్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. దీనిని ఆకాష్ పూరీ విడుదల చేసి యూనిట్ కు విషెస్ తెలిపారు.
పుట్టుకతోనే నువ్వు గెలిచి వచ్చావ్.. ఇంకా నీకు ఓటమి ఏంటన్నా అంటూ అద్భుతమైన లిరిక్స్‌తో ఈ పాట ఉంది.ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సినిమా పాటలకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.