టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ విచారణ కొనసాగుతోంది. తొలిరోజు దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణకు హాజరయ్యాడు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఈడీ ఆఫీస్ కు వెళ్లాడు. కారు దిగిన వెంటనే కార్యాలయం లోపలికి వెళ్లిపోయాడు.
పూరీ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే అంశాలపై ప్రశ్నలు వేయనున్నారు అధికారులు. పూరీతో పాటు ఆయన కుమారుడు ఆకాష్, చార్టెడ్ అకౌంటెట్ ఈడీ ఆఫీస్ కి వచ్చారు.