కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్లో ఉంటూ కొన్ని సలహాలు సూచనలు లను పూరీ మ్యూజింగ్స్ పేరుతో ఆడియో సందేశాలను పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పూరీ జగన్నాథ్ ప్రస్తుతం డైలమాలో పడ్డాడంటూ ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ డైలమో వల్లే తన సినిమాల గురించి కానీ విడుదల గురించి గానీ ఎలాంటి అప్డేట్స్ పూరీ జగన్నాథ్ ఇవ్వలేకపోతున్నామని మాట్లాడుకుంటున్నారు.
ఇక పూరీ జగన్నాథ్ సెట్ లో ఎప్పుడు అడుగుపెడతారు అనేది విషయం పై కూడా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమాని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. ఇక గతంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకొని సక్సెస్ సాధించారు పూరీ జగన్నాథ్.