గత కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న ఛార్మి ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తుంది. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టి ప్రస్తుతం విజయదేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఛార్మి తాజాగా బాలయ్య పై ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ కామెంట్ చేసింది. బాలయ్యతో సినిమా తియ్యడానికి పూరీజగన్నాథ్ ఎప్పుడో రెడీ అని…కాకపోతే బాలయ్యతో సినిమా తియ్యాలంటే మంచి కంటెంట్ ఉన్న కథ ఉండాలని చెప్పుకొచ్చింది. స్క్రిప్టు కుదిరితే ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని తెలిపింది.
ఇకపోతే గతంలో పూరీ బాలయ్య కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.