పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఫైటర్. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాను ఛార్మి తో కలిసి కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. కరోనా లాక్ డౌన్ తర్వాత ఇటీవల చాలా సినిమాలు షూటింగ్ లను రీస్టార్ట్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ కూడా ఫైటర్ మూవీ ని రీస్టార్ట్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఫారిన్ షెడ్యూల్ కావడంతో షూటింగ్ వాయిదా వేస్తున్న ఫైటర్ టీం ఫైనల్ గా షూటింగ్ షూట్ చేసేందుకు రెడి అయ్యింది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి తర్వాత ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. పూరి ఫేవరెట్ లొకేషన్ బ్యాంకాక్ లో యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారట.