శివమణి, సూపర్ మూవీలతో హిట్ కాంబినేషన్ గా నిలిచారు హీరో నాగార్జున, డైరెక్టర్ పూరీ. నాగ్ ని డిఫరెంట్ లుక్ లో చూపించి దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు పూరీ. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుందని టాక్ వినిపిస్తోంది.
పూరీ జగన్నాథ్ నాగార్జున కోసం మంచి స్టోరీ ఒకటి రెడీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో పూరీ టచ్ చేరని ఓ డిఫరెంట్ జోనర్లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాలీవుడ్ టాక్.