పూరి జగన్నాథ్ మెహబూబా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టికి ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడిప్పేడే నేహాకు అవకాశాలు వస్తున్నట్లు కనపడుతుంది. ఇటీవల… మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో ఓ కీలక పాత్ర చేసిన నేహాకు ఇప్పుడు మరో ఛాన్స్ దక్కింది.
సందీప్ కిషన్ – జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో రాబోతున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నేహాశెట్టి ఎంపికైంది. తన సినిమాలో హన్సికని కథానాయికగా ఎంచుకోవడం నాగేశ్వరెడ్డికి సెంటిమెంట్. కానీ ఈసారీ హన్సికనే హీరోయిన్ చేస్తారనుకున్నారు. కానీ అనుహ్యంగా పూరీ హీరోయిన్ ను రంగంలోకి దించారు.
ఇటు హన్సికకు కూడా స్పెషల్ సాంగ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెనాలి ప్లాప్ తర్వాత మరోసారి జతకట్టారు.