అల్లు అర్జున్- సుకుమార్ కాంభినేషనల్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. దట్టమైన అడవుల్లో… ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో నిలిచిపోయిన షూటింగ్… ఇటీవలే తూ.గోదావరి జిల్లాలోని మారేడుపల్లి అటవీ ప్రాంతంలో మొదలైంది.
200మంది క్రూతో నెల రోజుల పాటు కీలక సన్నివేశాలు తీయాలని డైరెక్టర్ సుకుమార్ భావించాడు. కానీ షూటింగ్ కోసం వెళ్లిన వారిలో దాదాపు 15మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావటంతో యూనిట్ షాక్ కు గురైంది. దీంతో అర్ధాంతరంగానే షూటింగ్ క్లోజ్ చేసుకొని తిరుగుముఖం పట్టినట్లు తెలుస్తోంది. మళ్లీ షూట్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్నది కూడా ఇప్పుడు మిస్టరీగానే మారింది.
ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప షూటింగ్ ఇక వచ్చే ఏడాది కరోనా పరిస్థితులు సద్ధుమణిగిన తర్వాతే ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సినిమా నిర్మిస్తుండగా… రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.