ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ వరుసగా రెండోసారి బుధవారం ప్రమాణ స్వీ్కారం చేయనున్నారు. రాష్ట్ర రాజధాని డెహ్రడూన్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆయన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డాతో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.
ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం దృష్ట్యా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఉత్తరాఖండ్ శాసన సభాపక్ష నేత ఎన్నికను సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీలు పరిశీలకులుగా ఉన్నారు. ఇందులో శాసనసభా పక్ష నేతగా పుష్కర్ సింగ్ ధామీని బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.