లెక్కప్రకారం పుష్ప-2 ది రూల్ వచ్చే నెలలో సెట్స్ పైకి రావాలి. డిసెంబర్ లో థియేటర్లలోకి రావాలి. కానీ ఇప్పుడీ షెడ్యూల్స్ ను మార్చే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. అనుకున్నట్టు ఏప్రిల్ లోనే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చినప్పటికీ.. రిలీజ్ మాత్రం వచ్చే ఏడాది పెట్టుకోవాలనుకుంటున్నాడు. దీనికి కారణం క్వాలిటీపై ఫోకస్ పెట్టడమే.
పుష్ప-1 సినిమాను ఆఖరి నిమిషంలో క్యూబ్స్ కు పంపించారు. దీంతో చాలా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సౌండి మిక్సింగ్ అస్సలు కుదర్లేదు. చాలా ప్రింట్స్ లో పేలవమైన సౌండ్ మిక్సింగ్ కనిపించింది. అదృష్టవశాత్తూ కంటెంట్ బాగుంది కాబట్టి, అవన్నీ కవర్ అయిపోయాయి. మరోవైపు గ్రాఫిక్స్ కూడా అక్కడక్కడ తేలిపోయాయి. ఆఖరి నిమిషంలో తలెత్తిన ఇలాంటి సమస్యల్ని పుష్ప-2 విషయంలో రిపీట్ చేయకూడదని యూనిట్ భావిస్తోంది.
పుష్ప సినిమా హిట్టవ్వడంతో పార్ట్-2పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాల్ని అందుకోవాలంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఆఖరి నిమిషంలో తలనొప్పులు తగ్గించుకోవడం పాటు కాస్టింగ్ పై కూడా మరోసారి ఆలోచించుకోవాలి. కేజీఎఫ్ హిట్టవ్వడంతో, పార్ట్-2 కోసం సంజయ్ దత్, రవీనాటాండన్ లాంటి బాలీవుడ్ తారల్ని రంగంలోకి దించారు. పుష్ప-2 కోసం అలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు. కాబట్టి మరింత పకడ్బందీగా సినిమాను తీయాలంటే వచ్చే ఏడాది విడుదల పెట్టుకుంటేనే కరెక్ట్.
ప్రస్తుతానికి టీమ్ ఇంకా పుష్ప పార్ట్-1 సంబరాల్లోనే ఉంది. ఇప్పటికీ బన్నీకి ఎవరో ఒకరు పార్టీ ఇస్తూనే ఉన్నారు. మొన్నటికిమొన్న బన్నీ మామ, అతడికి పెద్ద పార్టీ ఇచ్చారు. అటు సుకుమార్ కూడా విహార యాత్రకు వెళ్లివచ్చాడు.