హీరో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చిన సినిమా పుష్ప.అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో సూపర్ హిట్ సాధించి మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది.
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ సినిమాతో అల్లు అర్జున్ కి నేషనల్ లెవల్లో కొత్త అభిమానులు యాడ్ అయ్యారు.
ఇక కలెక్షన్స్ పరంగా హిందీలో ఈ సినిమా రూ. వంద కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లు రాబట్టింది. ఇప్పుడు చిత్రం రెండవ భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్.
ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ మొదలు పెట్టి చాలా రోజులైనా సినిమా అప్డేట్ ఇవ్వలేదని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిరాశలో ఉన్న అభిమానుల కోసం డైరెక్టర్ సుకుమార్ గుడ్ న్యూస్ చెప్పేశాడు.పుష్ప సినిమా అప్డేట్స్ వస్తున్నాయి అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా మూవీ టీజర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి భాగంతో దేశవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించిన పుష్ప రాజ్.. సెకండ్ పార్ట్ తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడో వేచి చూడాలి. పుష్ప 2కు ఓటీటీ రైట్స్ కోసం భారీగా పోటీ జరుగుతోందని టాక్.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 200 కోట్లు కోట్ చేస్తున్నారట. ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ. 200 కోట్లు ఇచ్చయినా సరే పుష్ప 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని సమాచారం. మరి రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.