స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రం భారీ విజయం సాధించింది. అన్ని భాషల్లోనూ మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. దీంతో పుష్ప పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ప్రేక్షకులు కూడా పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, మార్చి చివర్లో లేదా ఏప్రిల్లో పుష్ప 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవ్వాల్సి ఉండగా పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘పుష్ప: ది రూల్’ జూన్ చివరలో లేదా.. జూలై ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
త్వరలో పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతుండటంతో ఈ మూవీ మేకర్స్ చకచక పనులు చేస్తున్నారట. పార్ట్1 కి కొనసాగింపుగా పార్ట్ 2 కథ నడుస్తుంది. దానికి తగ్గట్టుగానే సుకుమార్ రైటర్స్ టీం స్క్రిప్ట్ వర్క్ ను ఇప్పటికే పూర్తి చేసింది. అంతే కాదు ఈ సినిమా కోసం వికారాబాద్ అడవులు, నల్లమల్ల ఫారెస్ట్, తదితర లోకేషన్ వేటలో పడ్డారు మేకర్స్. ఇప్పటికే సెకండ్ పార్టులో హీరోకి విలన్ కి మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా పోరాటం మొదలవుతుందని సుకుమార్ చెప్పేశారు. అందుకు తగ్గటుగానే సీన్స్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, దర్శకుడు సుకుమార్ పార్ట్ 2 లో కూడా ట్రెండ్ సెట్టర్‌గా ఉండే డైలాగ్‌లపై ఎక్కవ దృష్టి పెట్టిరట. అంతే కాదు పుష్ప పార్ట్2లో ఫహద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉండబోతోంది.
ఇక ఈ సినిమా షూటింగ్‌కి ముందే బన్నీ కుటుంబంతో ట్రిప్ వేయనున్నారట. అది కూడా షూటింగ్ ఆలస్యం అవ్వడానికి కారణమని తెలుస్తోంది. భార్య స్నేహా రెడ్డి, పిల్లలతో కలిసి బన్నీ కాస్తా టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారట. పుష్ప 2 షూటింగ్ ప్రారంభమైతే టైం ఉండదని, షూటింగ్ ప్రారంభానికి ముందే బన్నీ ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేశారట.
కరోనా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత విడుదలైన సినిమాల్లో భారీ విజయం సాధించింది పుష్ప పార్ట్ 1. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించారు. దేవి శ్రీ మ్యూజిక్ అందించారు. పార్ట్1 కి డైలాగ్స్ రాసిన శ్రీకాంత్ విస్సా పార్ట్ 2 కి కూడా డైలాగ్స్ రాయన్నారు. దాదాపు మూడు నెలలకు పైగా ఈ సినిమాని షూట్ చేయబోతున్నారు. ఈ క్రమంలో అన్ని అనుకున్నట్లు జరిగి జూన్ చివర్లో లేదా జూలై ప్రారంభంలో పార్ట్ 2 సెట్స్‌పైకి వెళ్తే.. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. ఇక షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.