క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకుక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘పుష్ప’.ఈ చిత్రాన్ని విధిలేని పరిస్థితుల్లో రెండు భాగాలుగా విభజించాడు సుక్కు.
ఎప్పటిలాగే టెన్షన్ పడుతూ పుష్ప-1 విడుదల చేసాడు.అయితే తొలుత డివైడ్ టాక్ నడిచినప్పటికీ క్రమంగా ఊహించని రీతిలో విజయవంతమైంది. బాలీవుడ్ లో అయితే బంపర్ హిట్ అయ్యింది.
దీంతో సెకెండ్ పార్ట్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు సుక్కూకి మరో టెన్షన్ మొదలైంది. అతకు మించి విజయవంతం చేయాలని పుష్ప- 2 పై మరింత కసరత్తు చేస్తున్నాడు మన లెక్కల మాష్టారు.
అయితే ఇటీవల ప్రముఖ మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ షూటింగ్ లొకేషన్లో ఉన్న ఫొటోను విడుదల చేసింది చిత్ర బృందం. అంతకుముందు, ‘వేర్ ఈజ్ పుష్ప’ అని ఓ ప్రచార వీడియో విడుదల చేసింది. అనంతరం ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దీంతో ‘పుష్ప-2’ ఎప్పుడు విడులవుతుందా? అని అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమాను ఈ ఎడాది డిసెంబర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగింది.
కానీ ఆ టైమ్కు కూడా ఈ మూవీ రిలీజ్ కష్టమేననే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రతి ఫ్రేమ్లో పర్ఫెక్షన్ చూపించే దర్శకుడు సుకుమార్.. ఈ సినిమా జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నారట సుకుమార్.
అందులో భాగంగానే ఆదరాబాదరాగా సినిమాను పూర్తి చేసేందుకు సుకుమార్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మే 2024 వరకు విడుదల కాకపోవచ్చని ప్రచారం సాగుతోంది.
2024 మే, జులై విండోలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రం బృందం ఉందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై.. వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మికతో పాటు ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.