సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే సినిమాలోని 5 పాటలు యూట్యూబ్‌లో టాప్ 100 గ్లోబల్ సాంగ్స్ జాబితాలో ఉన్నాయి. మొదటి స్థానంలో ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ ఉండగా రెండో స్థానంలో సామి సామి సాంగ్ ఉంది. ఇక 24వ స్థానంలో శ్రీవల్లి సాంగ్, 74వ స్థానంలో దాక్కో దాకో మేక సాంగ్, 97వ స్థానంలో ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్ ఉన్నాయి.