టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప తర్వాత ఒక్కసారిగా పెరిగిపోయింది. నిజానికి అప్పటికే అల్లు అర్జున్ కి సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ పుష్ప తర్వాత ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ నార్త్ లో కూడా బీభత్సంగా పెరిగిపోయింది. ఇప్పుడు బన్నీ ఎక్కడ ఉండే అక్కడ సందడి కనిపిస్తుంది. ఇక పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
అల్లు అర్జున్ కు తెలుగుతోపాటు మలయాళంలో కూడా కోట్లాదిమంది అభిమానులున్నారని తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ తన ట్విట్టర్ లో ప్రొఫైల్ పిక్చర్ మార్చారు. బ్లాక్ షర్ట్ లో కర్లీ హెయిర్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు బన్నీ. సూపర్ స్టైలిష్ లుక్ లో బన్నీ కనిపిస్తున్నారు. ఇది ఏ సినిమా లుక్ అని తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులకి అయితే తెగ నచ్చేసింది.
ఇక ‘పుష్ప’ సినిమాలో ఉంగరాల జుట్టుతో కనిపించిన బన్నీ ఇప్పుడు కొత్త లుక్ లో ‘పుష్ప2’లో కనిపిస్తారా..? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పార్ట్ 2 రాసుకుంటున్నారు దర్శకుడు సుకుమార్. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు.
కథ ప్రకారం.. ‘పుష్ప2’లో కొత్త క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయని సమాచారం. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. కొత్త వారిని కూడా తీసుకుంటున్నారు.ఇక ఈ సినిమాలో రష్మీక పాత్ర కొద్ది సేపు ఉంటుందని టాక్. ఈ సినిమాను రూ.350 కోట్ల బడ్జెట్ లో చిత్రీకరించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈఏడాది డిసెంబర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.