క్రియేటివ్ దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా వసూళ్లు టాలీవుడ్ స్థాయిని మరింత పెంచాయి అనే మాట వాస్తవం. సినిమాలో నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. హీరోయిన్ గా నటించిన రష్మిక మందన కూడా చాలా బాగా చేసింది. ఇక పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
ఈ సినిమాపై టాలీవుడ్ లో విమర్శకులు సైతం నోర్లు మూశారు అనే చెప్పాలి. ఇక బాలీవుడ్ లో కూడా సినిమాకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. పుష్ప డైలాగులను కూడా బాగా ప్రమోట్ చేసారు. బాలీవుడ్ లో పుష్ప 2 సినిమా కోసం కూడా బాగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా కొంత షూట్ అయింది. త్వరలోనే మరికొంత షూట్ చేసే అవకాశం ఉందని, ఆ తర్వాత ఏప్రిల్ నుంచి విరామం లేకుండా షూట్ చేస్తారని అంటున్నారు.
ఇక ఈ సినిమా బాలీవుడ్ హక్కులు మొదటి భాగం ను కాస్త తక్కువకే అమ్మారు. కాని అక్కడ వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం జరిగింది. దీనితో రెండో పార్ట్ కి ఉన్న అంచనాలను క్యాష్ చేసుకుని కనీసం 60 నుంచి 70 కోట్లకు అమ్మాలని ప్లాన్ చేస్తున్నట్టుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడి అగ్ర నిర్మాతలు చర్చలు కూడా జరుపుతున్నారు.