ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.
అయితే ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. హిందీ మార్కెట్ లో 100 కోట్ల కలెక్షన్ చేసింది. ఇదిలా ఉండగా ఈ చిత్రం 50 రోజులకు గాను ఏకంగా 365 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇక ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా సమంత స్పెషల్ సాంగ్ లో నటించారు. సునీల్, అనసూయ కీలక పాత్రలో నటించగా మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా త్వరలో పార్ట్ 2 గా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.