సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించింది. అలాగే సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది.
అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ గా నటించారు. ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వైడ్ గా మంచి విజయం సాధించింది. అంతే కాకుండా నిర్మాతలకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది.
ఇక ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ చూసుకుంటే
సీడెడ్ లో 15.80 కోట్ల షేర్,ఆంధ్రా 30 కోట్ల షేర్, కేరళ11. 50 కోట్లు, కర్ణాటక 9.30 కోట్ల షేర్,తమిళనాడు 22 కోట్ల గ్రాస్, నార్త్ ఇండియా85 కోట్లు,యుఎస్ ఏ 2.4 మిలియన్ గ్రాస్ వసూలు చేసింది.