అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. అల్లు అర్జున్ నటనకు టాలీవుడ్ జనాలు ఫిదా అయిపోయారు. దాదాపు మూడేళ్ల పాటు షూట్ చేసిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం ఇండియా వైడ్ గా ఫేమస్ అయింది. అమెజాన్ ప్రైమ్ చేసిన ప్రమోషన్ కు అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ అయింది.
Also Read:టికెట్ రేట్స్ తగ్గించమని ఎన్టీఆర్ వద్దకు దాసరి వెళ్తే… షాకింగ్ ఆన్సర్ చెప్పిన ఎన్టీఆర్…!
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొన్ని కొన్ని తప్పులు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి. కారు డోర్ తీయడం రాని కేశవ్ కారు కొనుక్కు రావడం సంచలనం అయింది. ఈ సినిమాలో సుకుమార్ చేసిన చిన్న చిన్న తప్పులతో సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ అవుతున్నారు. ఇందులో హే బిడ్డ ఇది నా అడ్డ అనే పాట ఉంటుంది. ఈ పాటలో ఒక చిన్న తప్పు జరిగింది.
అల్లు అర్జున్ తనను తానే చేతితో పైకి లేపి నన్ను అయితే కొట్టే వాడు ఈ భూమి మీద పుట్టలేదు అది మళ్ళా నేనే అని చెప్తాడు. ఆ సమయంలో పుష్ప తనను తానే కాలర్ పట్టుకుని పైకి లేపినట్టు చూపించాడు. ఈ సీన్ లో కాలర్ పట్టుకుని కనిపించాలి కాని ఎడిటర్ చేసిన చిన్న తప్పుతో విమర్శల పాలు అయింది. కాలర్ పట్టుకోకుండా చేయి లోపలికి వెళ్తుంది. దీనిపై కొందరు సరదాగా విమర్శలు చేస్తున్నారు.
Also Read:కరోనా నుండి కోలుకున్న ఇద్దరికి రెండవ వన్డేలో చోటు దక్కుతుందా..?