అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటించగా మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. రెండు పార్టులుగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం మొదటి పార్టు శుక్రవారం రిలీజ్ అయింది. అయితే మొదటి పార్టుకు పుష్ప ది రైజ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్.
అయితే ఎప్పటినుంచో సెకండ్ పార్టు కు టైటిల్ ఏంటి అనేది సినీ అభిమానుల్లో ఓ ప్రశ్నగా మిగిలిపోయింది. కాగా ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప పార్టు వన్ ఎండింగ్ లో పుష్ప ది రూల్ అంటూ టైటిల్ అనౌన్స్ చేశారు. సెకండ్ పార్టు లో బన్నీ ఒక రూలింగ్ తో కనిపించబోతున్నాడని టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది.
ఇక గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అత్యధిక భాగం అడవుల్లోని చిత్రీకరించారు. అందుకోసం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవులను సెలెక్ట్ చేసుకున్నాడు సుకుమార్.