సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పుష్పరాజ్ గా అల్లుఅర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Advertisements
ఇదిలా ఉండగా ఎప్పుడికప్పుడు అప్డేట్స్ ని ఇస్తూ ఈ సినిమాపై అంచనాలు పెంచిన సుకుమార్…. తాజాగా రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రష్మిక ఇందులో చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. శ్రీవల్లిగా రష్మిక మందన్న ఇందులో నటిస్తున్నారు. అద్దం ముందు పూవులు పెట్టుకుని కొత్తగా కనిపిస్తుంది.