సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా కనిపించనున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
రాజమండ్రి అటవీ ప్రాంతంలో ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్న అల్లుఅర్జున్ కు సంబంధించి కొన్ని ఫోటో లు కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక అక్కడ లొకేషన్ లో షూటింగ్ కంప్లీట్ అయ్యాక చిత్ర యూనిట్ వారణాసి వెళ్లనుందని సమాచారం. వారణాసిలో కొన్ని పాటల చిత్రీకరణ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య2 వంటి చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.