స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని మారేడుమిల్లి అరణ్య ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది. అయితే యూనిట్ లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ నుంచి హైదరాబాద్ కు వచ్చేశారు. అయితే మారేడుమిల్లి లో మిగిలిన భాగాన్ని హైదరాబాద్ లో చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు.
రామోజీ ఫిలిం సిటీ వెనకాల ఉన్న ప్రాంతంలో షూటింగ్ జరగబోతుందని తెలుస్తుంది. వచ్చే వారం నుంచి ఈ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఆలస్యంగా షూటింగ్ జరుగుతుండటం తో షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడట.