• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » రష్యాలో ‘పుష్ప’ టీమ్ సందడి

రష్యాలో ‘పుష్ప’ టీమ్ సందడి

Last Updated: November 30, 2022 at 4:07 pm

‘పుష్ప’మూవీ టీమ్ రష్యాలో సందడి చేశారు. పుష్ప చిత్రం డిసెంబర్ 8న రష్యాలో విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్ల కోసం అక్కడికి చేరుకుంది ఈ మూవీ టీమ్. రష్యాలోని ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవల సినిమా ట్రైలర్‌ ని కూడా రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. దానికి మంచి స్పందన లభించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, హీరోయిన్‌ రష్మిక మందన్నా, ప్రొడ్యూసర్ రవిశంకర్‌, డైరెక్టర్ సుకుమార్‌, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్‌ రష్యాలో అడుగుపెట్టారు. వీరికి గ్రాండ్ వెల్ కమ్ దక్కింది.

Team #PushpaTheRise Landed in Russia 💥💥

Meet the team at the Russian language Special premieres on Dec 1st at Moscow & Dec 3rd at St. Petersburg 💥💥#PushpaInRussia from Dec 8th 🔥

Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @MythriOfficial @4SeasonsCreati1 pic.twitter.com/Mt6xucws4h

— Pushpa (@PushpaMovie) November 30, 2022

రష్యాలో `పుష్ప`ని విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు వీరికి స్వాగతం పలికారు. తాజాగా ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం డిసెంబర్‌ 1న మాస్కోలో, డిసెంబర్‌ 3న సెయింట్‌ పీటర్స్ బర్గ్ లో `పుష్ప` ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు. ఇందులో ఈ టీమ్‌ పాల్గొనబోతుంది. మరోవైపు పలు ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనూ పాల్గొనబోతున్నారని సమాచారం.

`పుష్ప`మూవీ ఇండియాలో భారీ విజయాన్ని సాధించింది. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమాకి మొదట మిశ్రమ స్పందన లభించింది. ల్యాగ్‌ ఉందని, నిడివి ఎక్కువ ఉందని అన్నారు. కానీ కంటెంట్‌ కి అదేదీ సమస్య కాదని పుష్ప నిరూపించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. హిందీలోనే ఏకంగా సుమారు 90 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. మొత్తంగా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను, సినిమా యూనిట్‌ ని షాక్ ‌కి గురి చేసింది.

పుష్ప పార్ వన్ కి వరల్డ్ వైడ్ గుర్తింపు వస్తే.. అది పార్ట్-2కి కూడా ఉపయోగ పడుతుందనే ఉద్దేశంతోనే ‘పుష్ప ది రైజ్’ ని రష్యాలో రిలీజ్ చేస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడి ఆయడియన్స్ ని ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.

Primary Sidebar

తాజా వార్తలు

ఫారిన్ బస్సుల్లా.. డబుల్ డెక్కర్ బస్సులు

ప్రాణం పోయినా వెనకడుగు వేయను: మధుసూదన్ రెడ్డి

ఫార్ములా ఈ రేస్ ఎఫెక్ట్.. నరకయాతన పడుతోన్న నగర వాసులు

ప్రొఫెసర్ కాసీం అరెస్టు…!

బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్…!

దమ్ముంటే రాజీనామా చెయ్.. పువ్వాడ సవాల్!

షర్మిల నీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆంధ్రాకి వెళ్లిపో!

300 కోట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్!

నా పిల్ అడ్డుకుంటున్నారు.. కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు… సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ సర్కార్…!

ఆ ఛీతాలు మా పార్టీకి చేటు.. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే గోడు

అరుదైన రికార్డులకు దగ్గర్లో అశ్విన్!

ఫిల్మ్ నగర్

చీటింగ్ కేసులో హీరో నవీన్ రెడ్డి అరెస్ట్

చీటింగ్ కేసులో హీరో నవీన్ రెడ్డి అరెస్ట్

అమిగోస్‌ రన్‌ టైం ఎంతంటే!

అమిగోస్‌ రన్‌ టైం ఎంతంటే!

సలార్‌ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్‌!

సలార్‌ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్‌!

శరవేగంగా టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌!

శరవేగంగా టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌!

సార్‌ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

సార్‌ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

బాహుబలిలో అవంతిక రవిక ముడి..రహస్యం.. !?

బాహుబలిలో అవంతిక రవిక ముడి..రహస్యం.. !?

ఆమెకు  ఆ  సినిమాల్లో రాని గుర్తింపు  అఖండతో  వచ్చిందిగా..!

ఆమెకు ఆ సినిమాల్లో రాని గుర్తింపు అఖండతో వచ్చిందిగా..!

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న తరలింపు..!?

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న తరలింపు..!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap