టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ఫ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి ఊర మాస్‌లుక్‌లో ట్రై చేస్తున్న ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ పుష్ఫ రాజ్‌ను ఆడియెన్స్‌కు ఇంట్రడ్యూస్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్‌ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు.
పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో పుష్ఫ మూవీ తెరకెక్కినట్టుగా టీజర్‌ని చూస్తే అర్థమవుతోంది. తగ్గేదేలే.. అంటూ చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగ్ అదరగొడుతోంది. ఇక సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్నా.. ఓ గిరిజన అమ్మాయిలా కనిపిస్తోంది. పూర్తిగా ఈ స్టోరీ మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరగనుంది. బన్నీ లారీ క్లీనర్ పాత్ర చేస్తాడని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈమూవీని.. ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు. పుష్ఫ మూవీకి కూడా దేవీ శ్రీ ప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్.
పుష్ప టీజర్ ఇదే