పుష్ప పార్ట్ 1 ఏ రేంజ్ హిట్ అందుకుందో చూశాం. అల్లు అర్జున్ కెరీర్ లో 300 కోట్ల క్లబ్ లోకి చేరిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించింది. అంతేకాదు 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. అయితే.. రెండో పార్ట్ ను అంతకుముంచి అనేలా తెరకెక్కించాలని చూస్తున్నాడట సుకుమార్.
ఈ నెలాఖరున పుష్ప పార్ట్-2 షూటింగ్ ప్రారంభం కానుంది. రెండో పార్ట్ ను మరింత ఆసక్తికరంగా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నాడు సుకుమార్. ఇప్పటికే కొన్ని సన్నివేశాలను తీసినా.. వాటిపై సంతృప్తి చెందక రీ షూట్ చేయలని చూస్తున్నాడట. దీంతోపాటు స్క్రిప్ట్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొదటి భాగంలో ఉండడానికి చాలా క్యారెక్టర్లు ఉన్నా.. వాటికి న్యాయం జరగలేదనేది టాక్. దీంతో రెండో భాగంలో అందరినీ గట్టిగా వాడేద్దామని ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. అనేక ట్విస్టులుతో ఈ భాన్ని తెరకెక్కించాలని చూస్తున్నాట.
ఫహద్ ఫాసిల్, అనసూయ పాత్రలతోపాటు మిగిలిన క్యారెక్టర్లను కథలో కీలకం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సాంగ్స్ పై కూడా సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని ఫిలిం సర్కిల్స్ టాక్ నడుస్తోంది. పుష్ప రెండో పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తల్లో సుకుమార్ ఉన్నట్లు కనిపిస్తోంది.