తగ్గేదే లే.. బాక్సాఫీస్ పైకి దూసుకొచ్చి రికార్డులని బద్దలు కొట్టేశాడు పుష్ప. సినిమా సంగతి ఎలా ఉన్నా అందులోని పాటలు డైలాగులు మాత్రం ఇప్పటికీ మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా తగ్గేదేలే అనే డైలాగును.. అనుకరిస్తూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై సందడి చేస్తున్నారు. దీంతో ఈ మేనరిజం టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ హావభావాలకు వచ్చిన రెస్పాన్స్ చూసి సుకుమార్ ఇప్పుడు రెండో పార్ట్ లో అంతకుమించి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఫస్ట్ పార్టుకు మించి పుష్ప సెకండ్ పార్టు ఉంటుందని ఇప్పటికే చెబుతూ వస్తున్నారు మేకర్స్. అయితే ఇందులో బన్నీ బాడీ లాగ్వేజ్ అలాగే మేనరిజం లోను సుకుమార్ కొన్ని మార్పులు చేసే చేయబోతున్నాడని తెలుస్తోంది.
సెకండ్ పార్ట్ లో కూడా తగ్గేదే లే డైలాగ్ పెడితే బోర్ కొడుతుందని అందుకే చిన్న చేంజ్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి సెకండ్ పార్ట్ లో ఎలాంటి మేనరిజంతో ముందుకు వస్తాడో.