అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. 83 తర్వాత B-టౌన్ నుంచి విడుదల అవుతున్న పెద్ద సినిమాలలో ఇది ఒకటి. పుష్ప రిలీజ్ అయిన ఒక వారం తర్వాత రణవీర్ సింగ్ 83 వచ్చింది. ఇకపోతే మహారాష్ట్ర, ఢిల్లీ హర్యానాలోని అనేక స్క్రీన్‌లు పుష్ప సినిమాతోనే నడుస్తున్నాయి.
ఈ చిత్రం అన్ని భాషలలో కూడా OTTలో విడుదల అయినప్పటికీ కూడా థియేటర్స్ కు వచ్చి టికెట్స్ కొనిమరీ సినిమాను చూస్తున్నారు ప్రేక్షకులు. బాలీవుడ్ లో పుష్ప రాజ్ ఇప్పటివరకూ 107.60 కోట్లను కలెక్ట్ చేశాడు.
చివరి వారంలోపు 108 కోట్ల మార్కుకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద రూ.365 కోట్లు వసూలు చేసింది. 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది పుష్ప.
అయితే దాదాపు నెలన్నర తర్వాత, బాలీవుడ్‌లో భన్సాలీ గంగూబాయితో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ సినిమా వచ్చే వరకూ పుష్ప రాజ్ హవా కొనసాగించాలని చూస్తున్నాడు.