సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా షూట్ సెప్టెంబర్ ఆఖరు వరకు పూర్తి చేసి క్రిస్టమస్ కు రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడున్న స్టేటస్ ప్రకారం క్రిస్టమస్ కు సినిమా రిలీజ్ చేయటం ఆసాధ్యమని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరో 20రోజలు షూట్ పెండింగ్ లో ఉండగా… ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. మరో రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. వీటితో పాటు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేయాల్సి ఉండటంతో సినిమా విడుదల వాయిదా పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం సినిమాను సంక్రాంతి బరిలో ఉండనుంది. ఫహద్ ఫజీల్ విలన్ రోల్ లో కనిపించనుండగా, రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.