అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ సింగిల్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాక్కో దాక్కో మేక అంటూ సాగే ఈ పాట అన్ని భాషల్లో కూడా హిట్ అయింది.
ఇప్పుడు సెకండ్ సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ దీనికోసం ముందే సమాచారం బయటకి వచ్చేసింది. ఇది ఒక రొమాంటిక్ సాంగ్ అని బన్నీ, రష్మికా ల మధ్య ఉండే సాంగ్ అని కన్ఫర్మ్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యాజికల్ వాయిస్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ తో కలిసి ఓ సాంగ్ ని రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా క్రిష్మస్ కానుకగా రిలీజ్ కాబోతుంది.