సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ సింగిల్ కూడా విపరీతమైన ఆదరణ పొందింది.
ఇక హిందీ వెర్షన్ ఫస్ట్ సింగిల్ ఆలపించిన బాలీవుడ్ స్టార్ సింగర్ కంపోజర్ విశాల్ దద్లాని సెకండ్ సింగిల్ పై హింట్ ఇచ్చాడు. అది కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు. ఇక ఈ ట్వీట్ చేసినప్పటి నుంచి అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Tomorrow your song will fly, and in September, we will go flying together brother @ThisIsDSP ! 🤘🏽 #JaagoJaagoBakre #Pushpa @alluarjun https://t.co/DcaG8wvDup
— VISHAL DADLANI (@VishalDadlani) August 6, 2021
Advertisements