పుష్ప సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్న అల్లు అర్జున్-సుకుమార్ టీం… కొత్త ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చారు. దాదాపు 3కోట్లు ఖర్చు చేసి షూటింగ్ పూర్తి చేయగా, దాన్ని పూర్తిగా పక్కనపెట్టాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యిందని తెలుస్తోంది.
బన్నీ, సుకుమార్ ఈ మధ్య కేరళ షెడ్యూల్ ను స్క్రాప్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. షూటింగ్ మొదలయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కన్నా బెటర్ గా కొత్తగా గెటప్ డిజైన్ చేయాలని డిసైడ్ అయ్యారట. కొత్త గెటప్ బాగుంటే దాన్నే ఫిక్స్ చేయొచ్చు లేదంటే ఇప్పటికే ప్రేక్షకులకు రిలీజ్ చేసిన దాన్ని కంటిన్యూ చేయొచ్చని ఫిక్స్ అయ్యారట.
ఇక నెక్ట్స్ షెడ్యూల్ ను బ్యాంకాక్ అడవుల్లో ప్లాన్ చేసినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలోనే పూర్తి చేయాలని నిర్ణయించారని సమాచారం. కేరళ అనుమతిస్తే కేరళ అడవుల్లో… లేదంటే తూర్పు గోదావరి అడవుల్లో ఈ చిత్తూరు గందపు చెక్కల బ్యాక్ డ్రాప్ స్టోరీని తెరకెక్కించాలని ఫిక్స్ అయిపోయారని సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు.