గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ఇక అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ డిసెంబర్ 6న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే తాజా ఆ ట్రైలర్ కు సంబంధించిన టీజ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 27 సెకెన్ల నిడివితో విడుదల అయిన ఈ టీజ్ లో డిఫరెంట్ యాక్షన్ సీన్స్ కు సంబంధించి కట్స్ చూపించారు మేకర్స్. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Get ready to witness the MASSive #PushpaTrailer on Dec 6th 💥💥
▶️ https://t.co/Wn0pVmlFTe#PushpaTheRise #ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @adityamusic @MythriOfficial
— Pushpa (@PushpaMovie) December 3, 2021