దొరసాని సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమా మంచి హిట్ అయింది. ఆ తరువాత మెడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో మరో హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు మూడో చిత్రం పుష్పక విమానం విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా… విడుదల తేదీలను వాయిదా వేస్తూ వచ్చారు.
ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. పుష్పక విమానం ఆగమనాన్ని అడ్డుగా ఉన్న మేఘాలన్నీ తొలగిపోయాయి. ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీని నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయబోతున్నాం అంటూ నిర్మాతలు తెలిపారు. దామోదర ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రం తెరకెక్కుతుంది.