బీజేపీపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రత్యర్థి పార్టీలపైకి కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందన్నారు. దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తే భయపడే వాళ్లు చాలా మంది ఉండొచ్చన్నారు. కానీ తాము మాత్రం అలా భయపడబోమన్నారు.

మీరు మీకు చేతనైంది చేసుకోండని, కానీ తాము మాత్రం అన్నింటినీ భరిస్తామన్నారు. కానీ దేశాన్ని మాత్రం అమ్మకండంటూ ఆమె అన్నారు. దర్యాప్తు సంస్థలను తమపై ఎగదోయండన్నారు. కానీ దేశాన్ని, దేశ ప్రజలను మాత్రం ఐక్యంగా ఉండనీవ్వండంటూ సూచించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు సీఎం మమతా బెనర్జీ నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… అండమాన్ దీవుల పేర్లు మార్చడంపై ఆమె మండిపడ్డారు. ఇది కేవలం పాపులారిటీ పెంచుకునేందుకు చేసిన పనిగా ఆమె పేర్కొన్నారు.
1943లో అండమాన్ నికోబార్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు వెళ్లారని పేర్కొన్నారు. అప్పుడే వాటికి షహీద్, స్వరాజ్ దీవులని పేరు పెట్టారని వెల్లడించారు. నేతాజి సుభాష్ చంద్రబోస్ సూచించిన ప్రణాళికా సంఘాన్ని కేంద్రం రద్దు చేసిందని ఆమె గుర్తు చేశారు.