వ్లాదిమిర్ పుతిన్.. రష్యా అధ్యక్షుడిగా కంటే ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ఎక్కువ వార్తల్లో నిలిచారు. అది మొదలు పుతిన్ గురించి ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రపంచం ఆసక్తి చూపిస్తుంది. ఆయన భార్య, పిల్లలు..చివరికి ఆయన హెల్త్ కండిషన్ గురించి ఇలా ప్రతి దాని గురించి చాలా మంది ఫుల్ ఫోకస్ పెట్టారు. కొన్ని విషయాలైతే ఏకంగా మీడియా, నెట్టింట్లో కూడా హల్ చల్ చేశాయి.
ఆయన సన్నిహితులు కొందరైతే ఆయన ఎక్కువ రోజులు జీవించేదే లేదంటూ కొన్ని ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. అయితే వీటి అన్నింటికంటే ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఆయన ప్రేయసి గురించి. ఆమె జిమ్నాస్ట్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన అలీనా కబయేవా. ఆమెతో పుతిన్ కు బంధం ఉన్నట్లు గతంలోనే వార్తలు వినిపించాయి.
అప్పట్లో పుతిన్ కానీ ఆమె కానీ ఎప్పుడూ వీరి బంధం గురించి మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు తాజాగా వీరి గురించి ఓ వార్త నెట్టింట తిరిగేస్తుంది. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు తన గర్ల్ ఫ్రెండ్ అలీనాతో కలిసి ఖరీదైన, విలాసవంతమైన విల్లాలో రహస్యంగా గడిపేస్తున్నట్లు ఓ వార్త సంస్థ తెలిపింది. మాస్కో కు కొద్ది దూరంలో ఉన్న లేక్ వాల్లైకు సమీపంలో ఓ ఎస్టేట్ లో వీరు సిక్రెట్ గా ఉంటున్నట్లు పేర్కొంది.
అయితే ఆమెతో పాటు మరికొందరు పిల్లలు, కొందరు మహిళలను చూసినట్లుగా ఓ అధికారి వార్త సంస్థకు తెలిపారు. పుతిన్ ఆ ఎస్టేట్ ను రూ 990 కోట్లు పెట్టి ప్రత్యేకంగా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విల్లా నిర్మాణం 2020లో మొదలై.. రెండు సంవత్సరాలలోనే పూర్తి అయిపోయింది. నిర్మాణం మొత్తం అయిన తరువాత పుతిన్ తన ప్రేయసితో కలిసి అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ ఎస్టేట్ లో బంగారంతో తయారు చేసిన కుర్చీలు, గ్లాస్ టేబుళ్ల వంటివి కూడా చాలా ఖరీదైన వస్తువులు ఉన్నట్లు సమాచారం. ఇన్ని విషయాలు బయటకు వచ్చిన్నప్పటికీ పుతిన్ మాత్రం అలీనాను ఎప్పుడు కూడా తన గర్ల్ ఫ్రెండ్ గా అంగీకరించలేదు.