రష్యా సైన్యంతో నాటో దళాలు ప్రత్యక్ష ఘర్షణకు దిగితే అది ప్రపంచ విపత్తుకు దారి తీస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అన్నారు. కజకిస్తాన్ రాజధాని అస్తానాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రష్యా సైన్యంతో నాటో దళాలు ప్రత్యక్ష ఘర్షణకు దిగడమనేది ప్రపంప విపత్తుకు దారితీసే చాలా ప్రమాదకరమైన చర్య అని ఆయన అన్నారు. ఇలా చెబుతున్న వారు అలాంటి చర్య తీసుకోకుండా తెలివిగా ఉంటారని తాను ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
గత నెలలో ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ సందర్భంగా మాట్లాడిన పుతిన్…. రష్యా భూభాగాన్ని రక్షించుకోవడానికి అవసరమైతే అణ్వాయుధాలను కూడా ఉపయోగిస్తామని పుతిన్ తీవ్ర హెచ్చరికలు చేశారు.
పుతిన్ వ్యాఖ్యలను ఐక్యరాజ్య సమితి ఖండించింది. పుతిన్ వ్యాఖ్యలపై జీ7 దేశాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఉక్రెయిన్ పై అణు దాడులకు దిగితే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి. ఈ చర్యలతో ప్రపంచ శాంతి ప్రమాదంలో పడుతుందని వెల్లడించాయి.