రష్యా సైన్యం ఉక్రెయిన్ పై మారణకాండను కొనసాగిస్తోంది. ఇప్పటికే అనేక రాకాలుగా ఉక్రెయిన్ నష్ట పరిచిన పుతిన్ సేన.. ఉక్రెయిన్‌పై పుతిన్ పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించవచ్చు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఉక్రెయిన్‌పై దాడి సమయంలో తన మిలిటరీ వైఫల్యాలకు తిరిగి దక్కించుకునేందకు పూర్తి స్థాయి యుద్దాన్ని ప్రకటించవచ్చని పలు నివేదికలు చెప్తున్నాయి. రష్యా, పాశ్చాత్య అధికారు అవలంభిస్తున్న తీరును ఉద్దేశించి నివేదికలు పేర్కొన్నాయి.
నాజీ జర్మనీపై సోవియట్ సైన్యం సాధించిన విజయాన్ని రష్యా సాధించేందుకు సన్నాహాలు చేస్తోందని పేర్కొన్నాయి. అందుకు సంబంధించి తుది నిర్ణయాన్ని మే 9న ప్రకటన రావచ్చని నివేదికలు పేర్కొన్నాయి.
అయితే.. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం చేస్తున్న దాడిని పుతిన్ ‘స్పెషల్ ఆపరేషన్’గా అభివర్ణించారు. ఇప్పటికే రష్యా సైన్యం ఉక్రెయిన్ లోని పలు కీలక ప్రాంతాలను తన ఆదీనంలోకి తీసుకుంది.