హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రెండుసార్లు ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అజయ్‌కి తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన అజయ్, ఆ తర్వాత టీఆర్ఎస్ తీర్దం తీసుకున్నారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలోని 10 నియోజకవర్గాల్లో తెరాస తరఫున గెలిచిన ఏకైక అభ్యర్థిగా నిలిచారు.