ఇటీవల కాలంలో బయోపిక్ ల హవా నడుస్తోంది. ముఖ్యంగా క్రీడారంగంలో విజయాలు సాధించినటువంటి వ్యక్తుల బయోపిక్ లు తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటున్నారు దర్శకులు. గతంలో మహేంద్రసింగ్ ధోని, కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్, మేరీ కోమ్, మిల్కా సింగ్ వంటివారి బయోపిక్ ను తెరకెక్కించి మంచి వసూళ్లను రాబట్టారు. ఈ నేపథ్యంలోనే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తోంది.
ఇదిలా ఉండగా మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ కూడా తెరకెక్కనుంది. అయితే పీవీ సింధు గా మొదట బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే అనుకున్నారు. కానీ ఆ లిస్ట్ లోకి అక్కినేని సమంత చేరింది. అయితే ఈ సినిమాని నిర్మించబోయే సోనూసూద్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశారు. దీపికా మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని ఆమె డేట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు పట్టా లెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట సోను.