బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్‌లో మరోసారి నిరాశపరిచింది పీవీ సింధు. దక్షిణ కొరియా ప్లేయర్ చేతిలో 16–21, 12–21 తేడాతో ఓటమి పాలైంది.
ఆదివారం జరిగిన ఫైనల్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సియాంగ్‌తో తలపడింది సింధు. మొదట్నుంచి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.
ఇప్పటివరకు మూడుసార్లు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్‌కు చేరిన సింధు.. 2018లో టైటిల్ గెలుచుకుంది. తొలిసారి ఈ టైటిల్ ను గెలిచిన భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.