భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టింది. స్విస్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ లో థాయిలాండ్ కు చెందిన బుసానన్ పై 16-21, 8-21 తేడాతో గెలుపొందింది.
49 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో సింధు మొదటి నుంచి ఆధిపత్యం చెలాయించింది. ఈ ఏడాది సింధు ఖాతాలో ఇది రెండో టైటిల్. జనవరిలో సయ్యద్ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీని కైవసం చేసుకుంది.
ఇటీవల ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, జర్మన్ ఓపెన్ టోర్నీలలో అంతగా రాణించలేదు. అయితే.. స్విస్ ఓపెన్ లో తిరుగులేని విజయాలను నమోదు చేసింది.
మరోవైపు స్విస్ ఓపెన్ లో యువ షట్లర్ ప్రణయ్ నిరాశపరిచాడు. ఫైనల్ మ్యాచ్ లో ఇండోనేషియాకు చెందిన ఆటగాడితో 21-12, 21-18 తేడాతో ఓటమి పాలయ్యాడు.