చరిత్ర సృష్టించిన పీవీ సింధు
మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్
స్విట్జర్లాండ్: తెలుగుతేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో అద్భుతమైన విజయం సాధించింది. జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై గెలుపొంది భారత స్టార్ షట్లర్ అనే పేరును సార్ధకం చేసుకుంది. తొలి రౌండ్ నుంచి పీవీ సింధు అదరగొడుతూ వచ్చింది. రెండో రౌండ్‌లోనూ దూసుకెళ్లింది. రెండో గేమ్‌లో ఆది నుంచి పాయింట్లు సాధిస్తూ ఒకుహరపై పట్టు సాధించింది. సింధు విజయం పట్ల దేశం గర్విస్తున్నట్టు పలువురు ప్రముఖులు సందేశాలు పంపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సింధు ఘన విజయానికి హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.