వైసీపీ నేత, వ్యాపారవేత్త పీవీపీ అజ్ఞాతం వీడారు. ఆయనపై నమోదైన రెండు కేసులకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
కొద్దిరోజుల క్రితం ఓ కేసు విషయమై పీవీపీని ప్రశ్నించేందుకు పోలీసులు బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లగా.. వారిపట్ల ఆయన కుటుంబ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారు. పోలీసులపై వారు కుక్కలను వదిలారు. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోని కేసు నమోదు చేశారు. అదే సమయంలో పీవీపీ తెలంగాణ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పొందారు. ఆ వెంటనే విజయవాడ వెళ్లిపోయారు. తాజాగా విచారణకు రావాలని పోలీసులు నోటీసులు అందించడంతో.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పీవీపీ వచ్చారు.