పీవీఆర్ సంస్థకు దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ ఛెయిన్ ఉంది. ప్రస్తుతం దేశంలో స్ట్రాంగ్ గా ఉన్న మల్టీప్లెక్స్ చెయిన్ ఇదే. అంతేకాదు, వేగంగా విస్తరిస్తున్న కంపెనీ కూడా ఇదే. ఈ క్రమంలో మల్టీప్లెక్స్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది పీవీఆర్. ఇప్పటికే ఎక్స్ క్లూజివ్ లాంజ్ పేరిట కాస్ట్ లీ థియేటర్లు కడుతున్న ఈ సంస్థ, ఇప్పుడు తమ కంపెనీలోనే అత్యంత ఖరీదైన మల్టీప్లెక్స్ థియేటర్ ను నిర్మించింది.
బెంగళూరులో కొత్తగా ఓ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించింది పీవీఆర్ సంస్థ. 2వందలకు పైగా సీటింగ్ కలిగిన ఈ థియేటర్ దేశంలోనే ఖరీదైన లగ్జరీ మల్టీప్లెక్సుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే ఈ తరహా మల్టీప్లెక్సులు దేశంలో 3 ఉన్నప్పటికీ, వీటికంటే ఖరీదైన స్క్రీన్ గా ఇది గుర్తింపు తెచ్చుకుంది.
ఈ స్క్రీన్ కు డైరక్టర్స్ కట్ అనే పేరు పెట్టింది సదరు సంస్థ. కన్నడ స్టార్ సుదీప్ ఈ స్క్రీన్ ను రిబ్బన్ కట్ చేసి లాంఛ్ చేశాడు. ఇందులో లగ్జరీ సిట్టింగ్ ఉంటుంది. అన్నీ రిక్లయినర్ సీట్లే ఉంటాయి. ప్రతి సీట్ కు ఓ లైట్, పుష్ బ్యాక్, వాటర్ బాటిల్ లాంటి సౌకర్యాలున్నాయి. 4కే లేజర్ ప్రొజక్షన్ తో పాటు 7.1 డాల్బీ సరౌండ్ సిస్టమ్ తో పాటు 3డీ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.
ఈ స్క్రీన్ లో టికెట్ కనీస ధర 900 రూపాయలు. పై నుంచి కింది వరస వరకు ఒకే టికెట్ రేటు ఉంటుంది. కాకపోతే అందులో రిలీజయ్యే సినిమా బట్టి టికెట్ ధర పెరుగుతుంటుంది. ఆల్రెడీ బెంగళూరులో టికెట్ రేట్లు 1100 నుంచి 1400 రూపాయల వరకు ఉన్నాయి. అలా చూసుకుంటే, క్రేజ్ ఉన్న మూవీ రిలీజ్ అయినప్పుడు ఈ స్క్రీన్ లో టికెట్ ధర 1800 రూపాయలకు చేరడం ఖాయం.