ప్రపంచంలోనే అత్యుత్తమ వర్సిటీల జాబితాను క్వాకరోలి సైమండ్స్ అనే సంస్థ విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఈ జాబితాలో జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ, జమియా మిలియా ఇస్లామియా, ఢిల్లీ వర్సిటీ స్థానాలు కిందకి పడిపోయాయి.
తాజా జాబితా ప్రకారం… ఢిల్లీ వర్సిటీ ర్యాంకు 501-510 కేటగిరి నుంచి 521-530కు పడిపోయింది. మరో వర్సిటీ జేఎన్‌టీయూ ర్యాంకు 561-570 శ్రేణి నుంచి 601-650కు చేరుకుంది. జమియా మిలియా ఇస్లామియా ర్యాంకు 751-800 నుంచి 801-1000కు చేరింది.
జమియా హమర్ద్ వర్సిటీ ర్యాంకు గతంలో 1001-1200 మధ్య ఉండగ 1201-1400కు పడిపోయింది. ఢిల్లీ బయట ఉన్న వర్సిటీలలో హైదరాబాద్ వర్సిటీ ర్యాంకు( 651-700 నుంచి 751-800),జాదవ్ పూర్ వర్సిటీ ( 651-700 నుంచి 701-750), ఐఐటీ-భువనేశ్వర్ (701-750 నుంచి 801-1000కు ) చేరాయి.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు వర్సిటీ గతేడాదితో పోలిస్తే 31 స్థానాలు మెరుగు పరుచుకుని 276వ స్థానంలో నిలిచింది. ఐఐటీ ఢిల్లీ 11 స్థానాలు మెరుగు పరుచుకుని 174 స్థానంలో నిలిచింది. క్యూపీ జిందాల్ వర్సిటీ 235 ర్యాంకులో ఉంది.