ఈమె పేరు న్యాకిమ్ గ్యాట్ వెక్…ది క్వీన్ ఆఫ్ డార్క్ నెస్ ప్రపంచ ప్రసిద్దిపొందింది. అమెరికాకు చెందిన ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేమస్ అయ్యింది. ఆమె కలరే ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను తెచ్చిపెట్టింది.
కెన్యాలో పుట్టిన న్యాకిమ్ ….14 ఏళ్ల వయస్సులో తమ ఫ్యామిలీతో పాటు అమెరికాకు వలసొచ్చింది. తను చదువుకునే కాలేజ్ లో ఫ్యాషన్ షో చేయగా తనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దాన్నే ప్రేరణగా తీసుకొని మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. తన కలర్ ను తానెప్పుడూ తక్కువ చేసి చూసుకోలేదు….మరింతగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్న న్యాకిమ్ తన ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతుండేది…. ప్రస్తుతం న్యాకిమ్ కు ఇన్స్టాగ్రామ్ లో 10 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.