రష్మిక మాల్దీవుల్లో ల్యాండ్ అయింది. అదే టైమ్ లో విజయ్ దేవరకొండ కూడా మాల్దీవులకు వెళ్లినట్టు ఓ ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఇప్పుడు రష్మికపై వరుసపెట్టి ప్రశ్నల వర్షం కురుస్తోంది. దీనికి కారణం ఆమె కేవలం తన ఫొటోలను మాత్రమే రిలీజ్ చేస్తోంది మరి.
మాల్జీవుల్లోని బోలిఫుషీ దీవిలో ల్యాండ్ అయింది రష్మిక. ఆ ఐలాండ్ లో ఉన్న ఓజెన్ రిజర్వ్ కాటేజ్ లో దిగింది. ఈ ఫైవ్ స్టార్ రిసార్ట్ లో దిగిన రష్మిక.. వరుసపెట్టి తన ఫొటోల్ని రిలీజ్ చేస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో ఉన్న పిక్ ఒకటి, అందమైన ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న స్టిల్ ఒకటి.. ఇలా వరుసపెట్టి ఫొటోలు వస్తున్నాయి.
ఈ ఫొటోలతో పాటు చిన్న చిన్న అప్ డేట్స్ కూడా ఇస్తోంది. ఏ ప్రదేశానికి వెళ్లినా జిమ్ మాత్రం మిస్సవ్వనని, రెగ్యులర్ గా ఎక్సర్ సైజులు చేస్తున్నానని తెలిపింది. ఇలా వరుసపెట్టి అప్ డేట్స్ ఇస్తున్న రష్మిక, విజయ్ దేవరకొండ ఎక్కడున్నాడనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు.
రష్మిక ఫొటోలు పెడుతున్న ప్రతిసారి నెటిజన్ల నుంచి ఇదే ప్రశ్న ఎదురౌతోంది. విజయ్ దేవరకొండతో దిగిన ఫొటోను షేర్ చేయాలని కొందరు కోరితే, రష్మిక ఫొటోలు విజయ్ దేవరకొండనే తీస్తున్నాడంటూ మరికొందరు చమత్కరించారు. ఇలా రష్మిక పెడుతున్న ప్రతి ఫొటోను విజయ్ దేవరకొండకు ట్యాగ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.