పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ లను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరిగింది. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను 1500 నుంచి 3000కు పెంచాలన్నారు కృష్ణయ్య.
రాష్ట్ర ప్రభుత్వం మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతాలను పెంచింది… విద్యార్థులు ఏం పాపం చేశారని మండిపడ్డారు ఆర్ కృష్ణయ్య. విద్యార్థులపై పెట్టేది ఖర్చు కాదు… పెట్టుబడి అని చెప్పారు. వారి సమస్యలపై వెంటనే చర్యలు చేపట్టాలని లేకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.