హైదరాబాద్ : హీరో రాజ్‌తరుణ్ కొత్త సినిమా పేరు ‘ఇద్దరి లోకం ఒకటే’. ఇఫ్పుడు రాజ్‌తరుణ్ చేసిన యాక్సిడెంట్ కేసులో కూడా టైటిల్ ‘ఇద్దరి కంప్లయింట్ ఒకటే..’.
ఇంతకీ కథేంటంటే… హీరో రాజ్‌తరుణ్ యాక్సిడెంట్ కేసు మరో ఇంట్రస్టింగ్ టర్న్ తీసుకుంది. ఈ కేసులో యాక్సిడెంట్ చేసి పరారైౌన వ్యక్తి.. దాన్ని వీడియో తీసిన వ్యక్తి ఇద్దరూ కూడా ఇప్పుడు పరస్పరం కంప్లయింట్ చేసుకుని కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు. అసలు కేసు దీనిమూలంగా మరుగున పడి బ్లాక్ మెయిలింగ్ టాపిక్ కొత్తగా హైలైట్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే… కారు యాక్సిడెంట్ తరువాత తాను తీసిన వీడియోలను డిలిట్ చేయాలని తనపై వత్తిడి తెస్తున్నారని కాస్ట్యూమ్ డిజైనర్ కార్తీక్ఆ రోపణ చేశాడు. వీడియోలు తీసేయాలని తనని రాజ్‌తరుణ్ అండ్ కో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని అతను మీడియా ముందుకొచ్చి చెప్పాడు.
దీనికి కౌంటర్‌గా సీనియర్ నటుడు రాజారవీంద్ర మరో ఆరోపణ చేస్తున్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ కార్తిక్ వీడియోలు తీసి రాజ్‌తరుణ్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు అతను చెబుతున్నాడు. కార్తీక్ చెపుతున్న దాంట్లో వాస్తవం లేదని ఆయన అంటున్నారు. వీడియోలు చూపించి తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కార్తీక్‌పై రాజారవీంద్ర మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐదు లక్షలు ఇస్తే వీడియోలు తీసేస్తానని కార్తిక్ చెప్పినట్టు రాజా రవీంద్ర కంప్లయింట్‌లో పేర్కొన్నారు. రాజ్ తరుణ్ కెరియర్ పోతుందని ఆలోచించి మూడు లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నా కార్తీక్ కుదరదని అంటున్నాడని, మొత్తం డబ్బులివ్వమని బ్లాక్ మెయిల్ చేయడంతో పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చిందని రాజా రవీంద్ర చెబుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీడియాకు వీడియోలు లీక్ చేస్తానని బెదిరించడంతో అంత డబ్బు ఇవ్వలేక సైలెంట్ అయ్యామని రాజారవీంద్ర చెబుతున్న వెర్షన్. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని సినీ ఆర్టిస్ట్ రవీంద్ర తెలిపారు.